: చిరంజీవితో యూపీ సీఎం భేటీ
రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్త్రరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పలు రాష్ట్ర, జాతీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఉదయం రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఇచ్చిన అల్పాహార విందుకు అఖిలేశ్ హాజరయ్యారు. ఈ రోజు నాగోలులో జరిగే అఖిల భారత యాదవ మహాసభ సమావేశానికి అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నారు.