: పులిహోర ప్యాకెటిస్తాం అంతే.. వరద బాధితుల పట్ల నిర్లక్ష్యం
వరద బాధితుల పట్ల భద్రాచలం మండల రెవెన్యూ అధికారులు కాఠిన్యంతో మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. గోదావరి పొంగి ప్రవహిస్తుండడంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో లోతట్టు కాలనీల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారి ఆకలి తీర్చే విషయంలో మాత్రం అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
తల్లీ పిల్లలకు కలిపి ఒకటే పులిహోర ప్యాకెట్ ఇచ్చారని బాధితులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ను సంప్రదించగా.. "మా వద్ద నిధులు లేవు. మేము పులిహోర ప్యాకెట్ ఒకటే ఇస్తాం.. అంతే" అని చెప్పారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్యాకెట్ తో ఆకలి తీరేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులతోనే బాధితుల ఆకలి తీర్చాలని లేదు. అధికారులు అడిగితే సాయం చేసే చేతులు ఎన్నో ముందుకు వస్తాయి. వారికి ఈ మాత్రం తెలియకపోవడం విచారకరం.