: ఇలా చేస్తే పిచ్చి తగ్గుతుందట


మానసిన వ్యాధిగ్రస్తులకు నయం చేసే సంగతి పక్కనపెడితే, వారి వ్యాధి నుండి కాస్త ఉపశమనాన్ని కలిగిచేందుకు ప్రత్యేక పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అతిధ్వనులు ద్వారా మానసిక వ్యాధి గ్రస్థులకు కొంతపాటి ఉపశమనాన్ని కలిగించవచ్చని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో వెలుగుచూసింది. మెదడులోని కొన్ని ప్రాంతాలకు ఈ అల్ట్రాసౌండ్‌ తరంగాలను పంపడం ద్వారా మానసిక వ్యాధి గ్రస్తులు కొద్దిసేపటి వరకూ ఆహ్లాదంగా సంతోషంగా ఉన్నారని తాము నిర్వహించిన అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ స్టార్ట్‌ హామెరాఫ్‌ నేతృత్వంలో ఒక అధ్యయన బృందం మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న 31 మంది వ్యాధిగ్రస్తులపై ఈ కొత్త రకం చికిత్స జరిపి పరీక్షించారు. ఈ పరీక్షలో భాగంగా వారి మెదడులోని కొన్ని భాగాలపైకి అతిధ్వని తరంగాలను పంపించారు. తర్వాత ఎలా ఉందని వారిని ప్రశ్నించినప్పుడు చికిత్స పూర్తయిన తర్వాత సుమారు 40 నిముషాల పాటు చాలా హాయిగా ఉందని వారు బదులిచ్చారు.

ఈ ఫలితాలపై ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన హామెరాఫ్‌ మాట్లాడుతూ మెదడులోని నాడీ కణాల్లో మైక్రోట్యుబ్యుల్స్‌ అనే సూక్ష్మమైన నిర్మాణాలు ఉంటాయని, మెదడు అతిధ్వని తరంగాల ప్రభావానికి గురైనప్పుడు ఇవి కంపించి రోగి మానసిక పరిస్థితిలో మార్పును తీసుకువస్తాయని తెలిపారు. హామెరాఫ్‌ ప్రయోగాలతోనే స్ఫూర్తిపొందిన జె సాంగ్యునెట్టి, జాన్‌అల్లెన్‌ అనే మరో ఇద్దరు పరిశోధకులు కూడా ఈ విధంగా అధ్యయనాన్ని నిర్వహించారు. వీరు రెండు మెగాహెర్జ్‌ల అతిధ్వని తరంగాలను 30 సెకన్లపాటు ఉపయోగించినప్పుడు రోగుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News