: నేడు చెన్నైలో ఐపీఎల్-6 వేలం పాట
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 6వ సీజన్ కోసం నేడు చెన్నైలో క్రికెటర్ల వేలం పాట జరుగుతుంది. తొమ్మిది ఫ్రాంచైజీలు తమ జట్ల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఈ వేలంలో పాల్గొంటున్నాయి. మొత్తం 101 మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో వున్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్లు మైకేల్ క్లార్క్, రీకీ పాంటింగ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందరి దృష్టీ వీరిద్దరిపైనే వుంది. వీరి కనీస ధర 2 కోట్ల రూపాయలకు పైనే వుంది. డెక్కన్ చార్జర్స్ ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ గా పేరు మార్చుకుని వేలంలో పాల్గొననుంది. డీసీ గ్రూపు నష్టాల పాలు కావడంతో డెక్కన్ చార్జర్స్ ను తమిళనాడుకు చెందిన సన్ గ్రూపు టేకోవర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత వేలం కేవలం 6వ సీజన్ కోసం మాత్రమే.