: పట్టుబిగిస్తోన్న ఇంగ్లండ్


యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ క్రమంగా మ్యాచ్ పై పట్టు బిగిస్తోంది. ఆటకు మూడోరోజే మ్యాచ్ ను తన చేతుల్లోకి తెచ్చుకున్న ఆతిథ్య జట్టు.. ఆసీస్ పై 367 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఓవర్ నైట్ స్కోరు 31/3తో నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. క్రీజులో రూట్ (80 బ్యాటింగ్), బెల్ (3 బ్యాటింగ్) ఉన్నారు. కాగా, లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 361 పరుగులు చేయగా.. ఆసీస్ 128 పరుగులకే ఆలౌటైంది.

  • Loading...

More Telugu News