: విద్యపై ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం దురదృష్టం: డిప్యూటీ సీఎం


డిప్యుటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్శింహ మన దేశంలో ప్రాథమిక విద్యపై శ్రద్ధ లేకపోవడం దారుణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆఖిల భారత వైశ్య సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు పశ్చిమ దేశాలు తీసుకుంటున్న శ్రద్ధ అమోఘమన్నారు. విదేశాల్లో ప్రాథమిక విద్య బలోపేతానికి 10 శాతం బడ్జెట్ ను కేటాయిస్తారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన పేద విద్యార్ధులను ఆయన సన్మానించారు.

  • Loading...

More Telugu News