: 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి పన్ను మినహాయింపు


పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. మహారాష్ట్ర వినోదపు చట్టం 1923 సెక్షన్ 6(3) కింద మిల్కా చిత్రానికి ఈరోజు నుంచి ఆరు నెలల వరకు పన్ను మినహాయింపును ఇస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో మిల్కా పాత్ర పోషించిన నటుడు ఫర్హాన్ అక్తర్, చిత్ర దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా కొన్నిరోజుల కిందట మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ ధోరెట్ ను కలిసి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. దాంతో, ఈ చిత్రాన్ని వీక్షించిన మహా సర్కారు.. యువతను క్రీడల వైపు మళ్ళించేందుకు ఈ చిత్రం బాగా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రస్తావిస్తూ, మినహాయింపుకు అంగీకరించింది.

  • Loading...

More Telugu News