: వాళ్ళు తిన్న భోజనంలో పురుగు మందుల అవశేషాలు..
బీహార్ లో ఛాప్రా జిల్లాలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 23 మంది బాలలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఫోరెన్సిక్ అధికారుల దర్యాప్తు ముగిసింది. ఆ రోజు స్కూలు విద్యార్ధులు తిన్న భోజనంలో క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉన్నట్టు ఫోరెన్సిక్ అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. దీనిపై ఆ స్కూలు ప్రిన్సిపాల్ పరారీలో ఉండగా ఆమె ఆస్తులను అధికారులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ప్రిన్సిపాల్ భర్తకు చెందిన దుకాణంలోనే మధ్యాహ్న భోజనానికి అవసరమైన వంటనూనెలు కొనుగోలు చేశారు. ఆ నూనెలను పురుగు మందుల క్యాన్లలో నిల్వ ఉంచడమే ఇంతటి అనర్థానికి కారణమైనట్టు తెలుస్తోంది.