: హస్తిన వెళ్ళిన డీజీపీ.. రాష్ట్ర శాంతి, భద్రతలపై నివేదిక


కేంద్రం హోం శాఖ నుంచి పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోబోతున్న కీలక తరుణం సమీపిస్తున్న నేపథ్యంలో.. నిన్న అర్ధరాత్రే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ఇస్తే శాంతి భద్రతల విషయంలో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయంపై డీజీపీ ఇవ్వనున్న నివేదిక కీలకం కానుంది. ముఖ్యంగా నక్సలిజం, మతతత్వం అంశాలపై అభిప్రాయం కోసమే డీజీపీకి హస్తిన నుంచి పిలుపు వచ్చిందని అంటున్నారు. పలు విషయాలపై చర్చించాల్సిన అవసరం ఉండటంతో మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని డీజీపీకి హోం శాఖ సూచించినట్టు తెలుస్తోంది. ఈ పర్యటనలో ముందు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో పాటు పలువురు అధికారులను డిజీపీ కలవనున్నారు.

  • Loading...

More Telugu News