: విమాన ప్రయాణికుడు మృతి
ఢిల్లీ నుంచి బెంగళూరు వెళుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఉత్తరాఖండ్ కు చెందిన ఉత్తమ్ సింగ్ కు ప్రయాణంలో ఉండగా గుండెనొప్పి వచ్చింది. దీంతో విమానాన్ని హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి అతన్ని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఉత్తమ్ సింగ్ మృతి చెందారు.