: అమెరికన్ కాన్సులేట్ వద్ద వ్యక్తి అరెస్ట్.. తుపాకీ స్వాధీనం


సికింద్రాబాద్ బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో కడపకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి ఓ తుపాకీ, నాలుగు తూటాలు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీకి సంబంధించిన పత్రాలు అతని వద్ద లేకపోవడంతో అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే అకస్మాత్తుగా తనిఖీలు చేశామని, ఇకపై కాన్సులేట్ వద్ద గట్టి భద్రత ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News