: తూచ్.. అంటున్న శివసేన చీఫ్


బీజేపీ సహా ఏ పార్టీలోనూ జాతీయనేతగా అభివర్ణించదగ్గ వ్యక్తి లేరని ముందు రోజు చేసిన వ్యాఖ్యలను శివసేన పార్టీ చీఫ్ ఉథ్థవ్ థాకరే వెనక్కి తీసుకున్నారు. ఈ మాటలు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని ప్రచారం జరుగుతుండటంతో ఈ రోజు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అవి కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని తెలిపారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీలో ఉన్నత విలువలు కలిగిన నేత లేరని అన్నట్లు ఈ రోజు ఓ మీడియా సమావేశంలో తెలిపారు. బీజేపీ ప్రచార కమిటీ చీఫ్ గా మోడీ ఎన్నికైనప్పుడు తాను కలిసి మద్ధతు తెలిపానని చెప్పారు. అయితే, ప్రధానమంత్రి అభ్యర్ధి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

  • Loading...

More Telugu News