: సీఎం క్రమశిక్షణ తప్పారంటున్న జానా
మంత్రి జానారెడ్డి నేడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో టీ కాంగ్రెస్ ఎంపీలతో ఈ ఉదయం సమావేశం నిర్వహించిన జానా.. కోర్ కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపై ముఖ్యమంత్రి లీకులు ఇవ్వడం సరికాదన్నారు. సీఎం క్రమశిక్షణ తప్పారని విమర్శించారు. ఎవరెన్ని లీకులు చేసుకున్నా తెలంగాణను అడ్డుకోలేరని జానా ధీమా వ్యక్తం చేశారు. సీఎం లీకులపై అధిష్ఠానానికి సమాచారం ఉందని, ఆ విషయం వారే చూసుకుంటారని చెప్పుకొచ్చారు.