: గుంటూరులో అడ్డంగా దొరికిన అరకోటి


పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు కట్టలుకట్టలుగా పట్టుబడుతోంది. ఇప్పటివరకూ ఎన్నికల సంఘం.. 9 కోట్ల రూపాయల మేర అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం చేసుకోగా, అత్యధికంగా సుమారు 4 కోట్ల రూపాయలు గుంటూరు జిల్లాలోనే దొరకడం విశేషం. తాజాగా ప్రత్తిపాడు మండలం బొర్రావారిపాలెంలో చెక్ పోస్టువద్ద వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 50 లక్షల రూపాయలు దొరికాయి. వాహనంలో ప్రయాణిస్తున్న వారిని విచారించగా చీరాల నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ ఒక్క చెక్ పోస్టు వద్దే రెండు కోట్ల రూపాయల వరకూ దొరకడం విశేషం.

  • Loading...

More Telugu News