: కేథార్ నాథ్ లో శిథిలాల వెలికితీతకు ఆటంకాలు
భారీ ఎత్తున వరదలు కేదార్ నాథ్ పట్టణంపై విరుచుకుపడి నెల రోజులు కావస్తున్నా, ఇప్పటికీ అక్కడి శిథిలాల వెలికితీతలో ఏమంత పురోగతి లేదు. పెద్ద పెద్ద కొండరాళ్లు, బురద, నిర్మాణాల శిథిలాలు అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి. పెద్ద క్రేన్లను అక్కడికి రప్పిస్తే గానీ పనులు ముందుకు సాగేట్లు లేవు. అయితే, ఇందుకు ప్రతికూల వాతావరణం ఆటంకంగా మారింది. దీంతో శిథిలాల వెలికితీతకే మరింత సమయం పట్టేట్లు కనిపిస్తోంది. ఆ తర్వాతే పునరుద్ధరణ పనులు ప్రారంభం అవుతాయి.