: బొత్సపై మరోసారి షర్మిల విమర్శలు


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై దివంగత వైఎస్ కుమార్తె షర్మిల మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన తండ్రి వైఎస్ మరణంతో చాలా నష్టపోయామని అందరూ అంటుంటే, బొత్స మాత్రం సొంత జిల్లా విజయనగరంలో ఎంతో లబ్ది పొందారన్నారు. ఈ విషయాన్ని తాను అనడం లేదని, ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల పైవిధంగా వ్యాఖ్యానించారు. జిల్లాలోని అన్ని వ్యాపారాలు బొత్స చేతుల్లోనే ఉన్నాయని ఆమె ఆరోపించారు.

ఇంతకుముందు ఇదే జిల్లాలో పాదయాత్ర సందర్భంగా.. బొత్స గాంధేయ వాదా.. బ్రాందేయ వాదా? అని విమర్శిస్తూ.. ఆయనను లిక్కర్ డాన్ గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన పీసీసీ చీఫ్ ఏకంగా రాజశేఖరరెడ్డిపైనే విమర్శలు చేశారు. 'వైఎస్ బ్రాందీ ముట్టని రోజెప్పుడైనా ఉందా?' అంటూ షర్మిల్ కు సవాల్ విసిరారు.

  • Loading...

More Telugu News