: టైగా ముగిసిన విండీస్, పాక్ వన్డే


విండీస్, పాక్ మధ్య జరిగిన మూడో వన్డే చివరికి టై గా ముగిసింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా గ్రాస్ ఐలెట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పాక్ జట్టు.. మిస్బా(75), అక్మల్(40) చలవతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రావో, హోల్డర్ రెండేసి వికెట్లు తీసుకుని రాణించారు. అనంతరం 230 విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు శామ్యూల్స్(46), సిమ్మన్స్(75)సమయోచిత బ్యాటింగ్ తో గెలిచేలా కన్పించినా.. వరుసగా వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రెండు జట్ల స్కోర్లు సమానం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. పాక్ బౌలర్లలో అజ్మల్, జుబైన్ ఖాన్ మూడేసి వికెట్లు తీసి రాణించారు. 'మెన్ ఆఫ్ ద మ్యాచ్' గా మిస్బావుల్ హక్, సిమ్మన్స్ సంయుక్తంగా నిలిచారు. సిరీస్ లో ఇరుజట్లు ఒక్కో మ్యాచ్ గెలిచి సమవుజ్జీలుగా నిలిచాయి.

  • Loading...

More Telugu News