: సింగిల్ గా షాపింగ్ చేయొద్దు: మహిళలపై పాక్ లో ఆంక్షలు
పాకిస్ధాన్ లోని వాయువ్య కరాక్ ప్రాంతంలో మత చాంధసవాదులు మహిళలపై మరికొన్ని ఆంక్షలను విధించారు. వెంట మగవారు ఉంటే తప్ప, ముస్లిం మహిళలు ఒంటరిగా మార్కెట్ కు రావద్దని ఆదేశించారు. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ పరిధిలో కరాక్ పట్టణం ఉంది. మహిళలు ఒంటరిగా మార్కెట్లలో తిరగడం వల్ల అసభ్యత పెరిగిపోతుందని నిన్న సమావేశమైన మతచాంధసులు నిర్ణయానికి వచ్చారు. ముస్లిం మహిళలు ఒంటరిగా రావద్దని ఆంక్షలు విధించారు. ఇందుకు సహకరించాలని పోలీసులను కోరడంతో వారు నిరాకరించారు. దీంతో ఒంటరిగా మహిళలు వస్తే వస్తువులు విక్రయించవద్దని వారు స్థానికంగా ఉన్న షాపుల వారిని ఆదేశించారు.