: కుటుంబాన్ని బలి తీసుకున్న భార్యాభర్తల ఘర్షణ
భార్యాభర్తల మధ్య ఘర్షణ చిలికిచిలికి గాలివానగా మారి నిండుకుటుంబాన్ని బలి తీసుకుంది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గంగంపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యా భర్తల నడుమ చిన్న విషయంలో రేగిన వివాదం ఘర్షణగా మారి ఇద్దరూ నిప్పంటించుకునే వరకూ వెళ్లింది. ఈ ఘటనలో భార్య, కుమారుడు మరణించగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు.