: కాశ్మీర్ లోయలో కొనసాగుతున్న కర్ఫ్యూ


వరుసగా రెండో రోజు కూడా కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. రెండు రోజుల కిందట రాంబాన్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఆందోళనకారులపై కాల్పులు జరపడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం అల్లర్లు పెద్ద ఎత్తున వ్యాపించాయి. వీటిని అదుపు చేయడానికి నిన్న తెల్లవారుజామునే లోయలోని అన్ని పట్టణాలలోనూ కర్ఫ్యూ విధించారు. అది ఈ రోజు కూడా కొనసాగుతోంది. శ్రీనగర్, బుద్గాం, గండర్ బాల్, బందిపొరా జిల్లాలలో, షోపియాన్, పుల్వామా, కుల్గాం, అనంతనాగ్, బిజ్ బెహరా, సోపోర్ పట్టణాలలో కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాలలో పలు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. మరోవైపు అమర్ నాథ్ యాత్ర ఈ రోజు కూడా నిలిచిపోయింది.

  • Loading...

More Telugu News