: కోటగిరి మరణంపై చిరంజీవి దిగ్భ్రాంతి.. ఏలూరుకు పయనం
మాజీ మంత్రి, తన సహచరుడు కోటగిరి విద్యాధర్ రావు ఆకస్మిక మరణం పట్ల కేంద్ర మంత్రి చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. హైదరాబాద్ చేరుకున్నాక నేరుగా ఏలూరు వెళ్లి కోటగిరి భౌతిక కాయాన్ని సందర్శించి, సంతాపం తెలుపనున్నట్లు సమాచారం. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన కోటగిరి విద్యాధరరావుకు, చిరంజీవికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ లో విలీనానికి ముందు కోటగిరి ప్రజారాజ్యం పార్టీకి తనవంతు సేవలు అందించారు. దీంతో కోటగిరి మరణం చిరంజీవిని కదిలించింది.