: పాటొస్తే భాష వస్తుంది


మీరు కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ భాషకు సంబంధించిన పాటలను వింటూ, పాడుతూ ఉండండి. కొద్దిరోజులకు మీకు చక్కగా ఆ భాష వచ్చేస్తుంది. ఈ విషయం ఊరికే చెప్పడం కాదు. దీనిపై ప్రత్యేక అధ్యయనం సాగించిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గురించి గట్టిగా చెబుతున్నారు. కొత్త భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషలో పాటల్ని పాడడం మొదలుపెడితే ఎంచక్కా ఆ భాష వచ్చేస్తుందంటున్నారు పరిశోధకులు.

ఎడిన్‌బరో విశ్వవిద్యాలయానికి చెందిన 'రీడ్‌ స్కూల్‌ఆఫ్‌ మ్యూజిక్‌' కు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో కొత్త భాషను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఆ భాషలో పాటలు పాడడం ప్రారంభిస్తే భాష ఇట్టే వచ్చేస్తుందని తేలింది. ఇందుకుగాను వీరు కొత్త భాష నేర్చుకోవాలని కోరుకునే వారిని కొందరిని ఎంపిక చేసుకున్నారు. వారిని మూడు బృందాలుగా విభజించారు. వారికి ఐదేసి పరీక్షల వంతున నిర్వహించారు. ఈ బృందంలో అభ్యసించాలనుకున్న భాషలో పాటలు నేర్చుకున్న బృందం కూడా ఉంది.

ఈ మూడు బృందాల సభ్యులకు వారు నిర్వహించిన పరీక్షల్లో పాటలు పాడే బృందమే తొందరగా తాము కోరుకున్న భాషను నేర్చుకున్నట్టు స్పష్టమైంది. అంతేకాదు, మిగిలిన వారికన్నా కూడా చాలా సునాయాసంగా తాము కోరుకున్న భాషను నేర్చుకున్నట్టు తేలింది. అధ్యయన బృందం నిర్వహించిన ఐదు పరీక్షల్లోను నాలుగింటిలో వీరు విజయాన్ని సాధించినట్టు వీరిపై అధ్యయనం నిర్వహించిన బృందం చెబుతోంది. కాబట్టి కొత్త భాష నేర్చుకోవాలనుకుంటే ఆ భాషలో అక్షరాలు నేర్చుకునేకన్నా ముందుగా ఆ భాషలోని పాటలు పాడడం నేర్చుకుంటే మనం సులభంగా సదరు భాషను వంటబట్టించుకోవచ్చన్నమాట.

  • Loading...

More Telugu News