: ఈ సాఫ్ట్‌వేర్ జ్యోతిష్యం చెబుతుంది!
సాధారణంగా జ్యోతిష్యంలో బాగా సాధన చేసిన వారు మన భవిష్యత్తును గురించి చెప్పడం జరుగుతుంటుంది. అయితే మన భవిష్యత్తును గురించి చెప్పే ఒక కొత్తరకం సాఫ్ట్ వేర్‌ను సాంకేతిక శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ సాఫ్ట్‌వేర్ మీరు కొన్ని నెలల తర్వాత ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటారు? వంటి పలు వివరాలను తెలియజేస్తుందట.
ఐటీ రంగంలో దిగ్గజాలుగా పేరొందిన మైక్రోసాఫ్ట్, గూగుల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్ పేరు 'ఫార్ అవుట్'. ఇది మనకు సంబంధించిన భవిష్యత్తును గురించి చక్కగా చెప్పేస్తుందట. ఈ కొత్తరకం సాఫ్ట్‌వేర్ మీ ప్రస్తుత అలవాట్లు, రోజువారి కార్యక్రమాలు, ప్రయాణాలు వంటి వాటిని సేకరించి, విశ్లేషించి, ఉజ్జాయింపులు నిర్ణయించి భవిష్యత్తును గురించి చెబుతుందట. ముందుగా మీకు జీపీఎస్ పరికరాలు అందించి వారం నుండి నెల రోజుల పాటు మీ జీవిత అలవాట్లు సేకరిస్తారు. అలా మీ జీవిత విధానంలో నమోదైన వివరాల తర్వాత వాటిని ఫార్ అవుట్ సాఫ్ట్‌వేర్‌కు అందిస్తారు. అది వాటన్నింటినీ విశ్లేషించి మరో కొన్ని నెలల తర్వాత, లేదా సంవత్సరాల తర్వాత మీరెక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? వంటి వివరాలతోబాటు భవిష్యత్తులో మీరు వేరే ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్లే అవకాశాలున్నాయా? మీ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? వంటి వాటి గురించి కూడా ఇది పరిగణనలోకి తీసుకుంటుందట.