: పేగుబంధాన్ని ఆలస్యంగా తెంచితే మంచిది


తల్లీ బిడ్డల మధ్య పేగుబంధాన్ని పుట్టిన వెంటనే కాకుండా కొంత ఆలస్యంగా తెంచితే మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే బొడ్డుతాడును తల్లినుండి వేరుచేసి ముడివేస్తారు. అయితే ఇలా వెంటనే బొడ్డుతాడును వేరుచేయకుండా కొంత ఆలస్యంగా వేరుచేసి ముడివేస్తే పుట్టిన బిడ్డకు ఎంతో మేలు జరుగుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

సూసన్‌ మెక్‌డోనాల్డ్‌ సారధ్యం లోని కొందరు పరిశోధకుల బృందం పుట్టిన వెంటనే బొడ్డుతాడును వేరుచేసి ముడివేయడం గురించి అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో పుట్టిన వెంటనే కాకుండా కొద్దిసేపు తర్వాత బొడ్డుతాడును వేరేచేసి ముడివేయడం వల్ల పుట్టిన శిశువుకు ఎంతో మేలు జరుగుతుందని తేలింది. ఇలా కొంత ఆలస్యంగా బొడ్డుతాడును వేరు చేయడం వల్ల నవజాత శిశువుల్లో రక్తం, ఇనుము స్థాయిలు బాగా పెరిగినట్టు ఈ అధ్యయనంలో తేలింది.

  • Loading...

More Telugu News