: తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కంగారు


యాషెస్ సిరీస్ రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ మరోసారి ఇంగ్లండ్ బౌలర్లకు దాసోహమన్నారు. ఇంగ్లండ్ సాధించిన 361 పరుగుల తొలి ఇన్నింగ్స్ స్కోరుకు బదులిచ్చేందుకు బరిలో దిగిన ఆసీస్ 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్వాన్ కు 3, బ్రెస్నన్ కు 2, బ్రాడ్ కు ఓ వికెట్ దక్కాయి. ఇక ఆసీస్ జట్టులో వాట్సన్ 30, కెప్టెన్ క్లార్క్ 28 పరుగులు చేశారు. కాగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కంగారూలు ఇంకా 270 పరుగుల దూరంలో ఉన్నారు. ఆటకు నేడు రెండో రోజు.

  • Loading...

More Telugu News