: మగాళ్ల పెర్ఫ్యూమ్స్ వాడతాను: ఆలియా భట్


బాలీవుడ్ తాజా సంచలనం ఆలియా భట్ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకునేందుకున్న అర్హతల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. తన కోరికల లిస్టు వెల్లడిస్తూ అభిమానులను ఊరిస్తోంది. తనకు బాగా పొడుగ్గా ఉన్న అబ్బాయిలు నచ్చుతారని, కానీ, వారికి సమయస్ఫూర్తి లేకుంటే కష్టమేనని చెబుతోంది. అలాగే తనకి మంచి వాసన కలిగి ఉండే అబ్బాయిలు నచ్చుతారని కూడా సెలవిచ్చింది. తానెప్పుడూ మగాళ్ల అత్తరులే వాడుతానని, అవి కూడా ప్రతి నెలా మార్చేస్తానని ఆలియా భట్ చెప్పింది. మరి 'నీతో నటించిన సహనటులతో నీకున్న సంబంధాలేంటి?' అని అడిగితే 'అవన్నీ స్పెషల్' అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది. తనకు ప్రధానంగా పోటీగా నిలిచే హీరోయిన్ గా పరిణీతి చోప్రా అని తడుముకోకుండా సమాధానమిచ్చి, తామిద్దరం స్నేహితులమంటూ ముక్తాయింపునిచ్చింది.

  • Loading...

More Telugu News