: బాలీవుడ్ కు రుచించని శృతి హసన్ 'రామయ్యా..'


తొలిచిత్రం 'లక్' తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శృతి హసన్ తాజాగా నటించిన 'రామయ్యా వస్తావయ్యా' అంతగా పేలలేదు. అందం పరంగా ఆకర్షించినా శృతిని ఈ చిత్రం కొంత నిరాశకు గురి చేసింది. కథ వివరాల్లోకి వెళితే... అన్న చూపించే ప్రేమ, అనుబంధాల మధ్య ఓ ముద్దుల చెల్లి (శృతి హసన్) పెరుగుతుంది. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో వ్యవసాయం చేసే అన్న(సోను సూద్) చెల్లిని గారాబంగా పెంచుతాడు. అలా ఓరోజు స్నేహితురాలి పెళ్లికి వెళ్లి అక్కడ ఓ ఎన్ఆర్ఐ ( హీరో గిరీష్ కుమార్) ప్రేమలో పడుతుంది.

అయితే, అతడి తల్లికి వారిద్దరి ప్రేమ ఇష్టం లేకపోవడంతో, హీరో.. హీరోయిన్ ఇంటికి వస్తాడు. కథానాయిక అన్న అనుమతితో కష్టపడి వ్యవసాయం చేస్తాడు . తన ప్రేమను దక్కించుకునేందుకు చెప్పిన ప్రతి పనీ చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ అన్నకు హీరో నచ్చేస్తాడు. ఇలా ఈ చిత్రంలో ప్రతి సీను ప్రేమ, ఆప్యాయతల మధ్య నడుస్తుంది. కథకు అనుగుణంగా వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. దాదాపు అంతా పల్లెటూరి వాతావరణంలో తీసిన ఈ చిత్రం బాలీవుడ్ ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేకపోయిందనవచ్చు.

రొమాంటిక్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ టిప్స్ అధినేత కుమార్ తౌరానీ కుమారుడు గిరీష్ కుమార్ హీరోగా తొలిసారి నటించాడు. కొంత పరిణతి చెందిన నటనతో కనిపించిన గిరీష్ కొంత మెప్పించాడని అనుకోవచ్చు. ఇందులో డ్రామా ఎక్కువగా ఉండటం, వాస్తవికతకు చోటు లేకపోవడం కూడా హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదని అనుకోవచ్చు. చిత్రానికి సంగీతం కొంత ప్లస్ పాయింటుగా నిలిచింది. ఇక హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రత్యేక పాట ప్రేక్షకులను అలరించింది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రభుదేవా తెలుగులో తొలిసారి రూపొందించిన 'నువ్వోస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో 'నువ్వొస్తానంటే..' తెలుగు, తమిళ భాషల్లో ఘన విజయం సాధించి ప్రభుదేవాను దర్శకుడిగా నిలబెట్టింది. అయితే, ఈ చిత్రం కూడా 1998లో హిందీలో వచ్చిన 'ప్యార్ కియా తో డర్నా క్యా' ఆధారంగా రూపొందించిందే. కథను యథాతధంగా ఉంచి కొన్ని మార్పులతో నవతరానికి అనుగుణంగా ప్రభు 'నువ్వోస్తానంటే నేనొద్దంటానా'ను రూపొందించారు.

  • Loading...

More Telugu News