: రాజశేఖరరెడ్డి మందు తాగితే నువ్వు సప్లయరువా? : కొండా సురేఖ
వైఎస్ రాజశేఖరరెడ్డిపై బొత్స చేసిన బ్రాందీ వ్యాఖ్యల పట్ల కొండా సురేఖ మండిపడ్డారు. రాజశేఖరరెడ్డి మందు తాగితే నువ్వు ఆయనకు సప్లయరువా? అని ప్రశ్నించారు. విజయమ్మ పోరు దీక్ష దగ్గర మాట్లాడిన ఆమె.. జననేత మృతి చెందితే, ఇంటికి మంత్రులను పిలిచి అల్పాహారాలు తినిపించి, జగన్ ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణకు పూనుకుంది నీవు కాదా? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు నోరెత్తుతున్న నేతలంతా గతంలో ఎలా ఉండేవారో గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. బ్రదర్ అనిల్ తప్పు చేస్తే ఏం చేశారో ప్రజలకు తెలపాలన్నారు. ప్రజాస్పందనకు ఓర్వలేక బొత్స చేస్తున్న విమర్శలు సరికాదని, ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విషయం గుర్తుంచుకోవాలని కొండా సురేఖ హెచ్చరించారు.