: సచిన్ టెండూల్కర్ కు అజ్జూ భాయ్ సలహా


సచిన్ టెండూల్కర్ ఇటీవలి కాలంలో తరచూ క్లీన్ బౌల్డ్ అవుతుండడం పట్ల మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ స్పందించాడు. ఢిల్లీలో నేడు పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వయసు మీదపడుతోన్న సచిన్ తన టెక్నిక్ ను పునఃసమీక్షించుకోవాలని సూచించాడు. అంతేగాకుండా, ఆఫ్ స్టంప్ ఆవల పిచ్ అయి వికెట్ల మీదికి వచ్చే బంతులను ఎదుర్కొనే క్రమంలో సచిన్ స్టాన్స్ మార్చుకుంటే ఫలితం కనిపిస్తుందన్నాడు. ఛాతీని బంతికి అభిముఖంగా నిలపడం వల్ల ఎదుర్కొనేందుకు తగిన సమయం ఉంటుందని అజ్జూ అభిప్రాయపడ్డాడు. విండీస్ బ్యాట్స్ మన్ శివనారాయణ్ చందర్ ఇలాంటి స్టాన్స్ తోనే బౌలర్లను విసిగిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక, పక్కవాటు స్టాన్స్ తో బంతి గమనం అంచనా వేసేందుకే సమయం సరిపోతుందని ఈ ఉత్తరప్రదేశ్ ఎంపీ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News