: మోడీకి మద్దతా.. ప్రశ్నే లేదు: మమతా బెనర్జీ
బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా నరేంద్ర మోడీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. యూపీఏపై కూడా తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు. పదేళ్లుగా దేశాన్ని పాలిస్తూ, ఇప్పడు మోడీని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఓట్లేయకుంటే బీజేపీ పాలిస్తుందంటూ ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకునేందుకు కాంగ్రెస్ చూస్తోందని అన్నారు. కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ, ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్ నటిస్తున్నాయే తప్ప ఆ రెండు పార్టీల మధ్య మంచి దోస్తీ ఉందని దీదీ అన్నారు.