: హ్యారిస్ కు ఐదు.. ఇంగ్లండ్ 361 ఆలౌట్
ఆసీస్ పేసర్ ర్యాన్ హ్యారిస్ ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టులో హ్యారిస్ బౌలింగ్ ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 361 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్ బ్యాట్స్ మన్ ఇయాన్ బెల్ (109) సెంచరీ సాధించగా, బెయిర్ స్టో (67), ట్రాట్ (58) అర్థసెంచరీలు నమోదు చేశారు. ఓవర్ నైట్ స్కోరు 283/7 తో రెండోరోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ చివరి మూడు వికెట్లను 78 పరుగుల తేడాతో చేజార్చుకుంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది.