: పాతబస్తీలో పురాతన శతఘ్ని గుండ్లు!
నగరంలోని పాతబస్తీ మొఘల్ పురాలోని సుల్తాన్ షాహీలో పురాతన శతఘ్ని గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి సంఖ్య 75 గా తెలిపారు. అయితే వీటిని పరీక్షల నిమిత్తం పంపించారు. భారీ మొత్తంలో శతఘ్ని గుండ్లు లభ్యమవడం స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.