: ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
ఢిల్లీలోని రేసు కోర్స్ రోడ్డులో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది. ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీ, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, కమల్ నాథ్, అహ్మద్ పటేల్ లు హాజరయ్యారు. ఇప్పటికే తెలంగాణపై సంప్రదింపులు ముగిశాయని దిగ్విజయ్ సింగ్ తెలపగా.. ఈ భేటీలో రెండో ఎస్సార్సీపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.