ప్రజాస్వామ్య స్పూర్తికి అనుగుణంగానే '
సడక్ బంద్' జరుగుతుందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న విశ్వాసం తమకుందన్న ఆయన, తెలంగాణపై సమావేశాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయనీ, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తామనీ అన్నారు.
అంతకు ముందు ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశమైన జానారెడ్డి పంచాయితీ ఎన్నికలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, వీలైనంత తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత విధానంలోనే ఈ ఎన్నికలు నిర్వహించా లనుకుంటున్నామని జానా పేర్కొన్నారు.