: సచిన్ కు ఝలకిచ్చిన భారత క్రీడల శాఖ
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు 'భారత రత్న' ఇవ్వాల్సిందే అని అంబానీల దగ్గరనుంచి లతా మంగేష్కర్ వరకూ అందరూ ముక్తకంఠంతో అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. పలువురు మాజీ క్రికెటర్లూ సచిన్ కు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని పేర్కొన్నారు. వీరందరి ఆకాంక్షలకు భారత క్రీడల మంత్రిత్వ శాఖ అడ్డుకట్ట వేస్తూ.. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ ను 'భారతరత్న'కు ప్రతిపాదించింది. ఈమేరకు తాము ప్రధాని మన్మోహన్ కు ఓ లేఖ కూడా పంపామని క్రీడల శాఖ కార్యదర్శి పీకే దేవ్ తెలిపారు. భారతరత్నకు ధ్యాన్ చంద్ ఒక్కరి పేరే నామినేట్ చేశామని ఆయన వెల్లడించారు.
ధ్యాన్ చంద్ మూడు పర్యాయాలు ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించారు. ఆయన హయాంలో భారత జట్టు ప్రపంచ హాకీ రంగాన్ని శాసించింది. తదనంతరం యూరోపియన్ శైలి హాకీ రంగప్రవేశం చేయడంతో సంప్రదాయశైలికి కట్టుబడే భారత్ లాంటి జట్లు వెనకబడిపోయాయి.