: సీసీఎల్ లో తారల చిందులకు కోట్లు కుమ్మరిస్తున్న నిర్వాహకులు


ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లకు హాజరైన హీరోయిన్లను చూశారా..? ఈ పోటీల్లో ఆడుతున్న హీరోలను ఉత్తేజ పరుస్తూ... కిర్రెక్కించే డ్రెస్సుల్లో... బౌండరీకి ఆవల హుషారుగా నర్తిస్తూ... వీక్షకులను సమ్మోహితుల్ని చేస్తున్న తారామణులను చూస్తే... అబ్బ... సినిమాల్లో లాగానే హీరోలను ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారో అనిపించక మానదు. అయితే వారేమీ హీరోలపై అభిమానంతోనో, సినీ పరిశ్రమ మీద ఆపేక్షతోనో మైదానంలోకి రాలేదంటే నమ్మడం కొంచం కష్టమే. కానీ, నమ్మకతప్పదు!

ఎందుకంటే, ఈ పోటీలకు హాజరై తమ నృత్య విన్యాసాలతో అలరించేందుకు ఈ ముద్దు గుమ్మలు కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారట. నిర్వాహకులు మొత్తం రూ. 8 కోట్లకు పైగా ఈ చిందులకే కేటాయించినట్టు తెలుస్తోంది.

కత్రినా కైఫ్ కు కోటి... కాజల్, ప్రియమణి, బిపాసా వంటి వారికి ఓ 20 నుంచి 50 లక్షల వరకు ముట్టజెప్పారని సమాచారం. ప్రభుదేవా నిర్వహించిన ఓ కార్యక్రమానికీ కోటి రూపాయలు చెల్లించినట్టు సినీ వర్గాలంటున్నాయి. సీసీఎల్ గత విడత పోటీల కంటే ఈ పర్యాయం వెచ్చిస్తున్న మొత్తమే ఎక్కువంటున్నారు.

  • Loading...

More Telugu News