: ఎంపీగా ఉండి పేకాట ఆడిన చరిత్ర బొత్సది: వైఎస్సార్సీపీ
బొత్స 'బ్రాందీ' వ్యాఖ్యలు వైఎస్సార్సీపీ నేతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. బొత్స నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు ఊహించని వైఎస్సార్సీపీ నేతలు ప్రతివిమర్శలతో విరుచుకుపడుతున్నారు. మద్యం, పేకాట లేకుండా పీసీసీ చీఫ్ కు రోజు గడవదని, ఎంపీగా ఉండి పేకాట ఆడిన చరిత్ర బొత్సదని వైఎస్సార్సీపీ నేతలు ఉదయభాను, జలీల్ ఖాన్ విమర్శించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం బొత్సకు కొత్త కాదన్నారు. పేదలను మద్యం మత్తులో ముంచెత్తుతూ కాసులు వెనకేసుకుంటున్న చరిత్ర బొత్సదని విమర్శిచారు. వైఎస్ లేకుంటే బొత్స కార్యకర్తగానే ఉండేవారని, బొత్సను అతని జిల్లా ప్రజలు బఫూన్ గా భావిస్తున్నారని ఉదయభాను, జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు.