: బొత్స 'బ్రాందీ' విమర్శలకు వీహెచ్ సంబరం


వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాందీ ముట్టని రోజుందా..!? అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు తనకు అమితానందం కలుగజేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, షర్మిళ చెబుతున్న పులి.. బోనులో ఉంటేనే మంచిదని, బయటకు వస్తే ఎవరూ మిగలరని అన్నారు. షర్మిళ ఇప్పటికైనా విమర్శలు ఆపకపోతే సత్తిబాబు మరిన్ని విషయాలు బయటపెడతారని హెచ్చరించారు. జగన్ తో పాటు దోచుకున్న వారి వివరాలు ఉండవల్లి బయటపెడితే బాగుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అంటూ ఇంకా ఎంతమంది చావుకు కారణమవుతారని ఆయన ప్రశ్నించారు. నేతలు మద్యం వ్యాపారం చేయాలా? వద్దా? అన్నది వారి విచక్షణకు వదిలెయ్యాలని వీహెచ్ అన్నారు.

  • Loading...

More Telugu News