: 'డెక్కన్ క్రానికల్' మాజీ డైరక్టర్ కు బెయిల్ మంజూరు


చెక్ బౌన్స్ కేసులో నిన్న అరెస్టయిన డెక్కన్ క్రానికల్ మాజీ డైరక్టర్ సుకుమార్ రెడ్డికి బెయిల్ లభించింది. చంఢీగఢ్ కు చెందిన రెలిగేర్ సంస్థ నుంచి రుణం తీసుకుని ఎగవేతకు పాల్పడిన సుకుమార్ పై పంజాబ్ లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నిన్న హైదరాబాద్ లో సుకుమార్ రెడ్డిని అరెస్టు చేసి చంఢీగఢ్ తరలించారు. ఈ మధ్యాహ్నం చంఢీగఢ్ జ్యుడిషియల్ కోర్టులో ఆయనను హాజరుపరచగా రూ.20 లక్షల షూరిటీతో బెయిల్ మంజూరు చేశారు. కేసు విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News