: అనారోగ్య మృతుల కంటే రోడ్డు ప్రమాద మృతులే ఎక్కువ: ఏకే ఖాన్


రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. ఖైరతాబాద్ లో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, థర్డ్ రాక్ కన్సల్టెంట్స్ సంస్థల సంయుక్త సదస్సు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధుల బారినపడి మృతి చెందుతున్న వారికంటే, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచేవారే ఎక్కువగా ఉన్నారని అన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రధానమైన అంశమని, అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాల సంఖ్య తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News