: ఓ ఇంటివాడైన క్రికెటర్ మనోజ్ తివారీ
బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ ఓ ఇంటివాడయ్యాడు. తివారీ తన స్నేహితురాలు సుష్మితా రాయ్ ను వివాహం చేసుకున్నాడు. గురువారం హౌరాలో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య సంబంధం గురించి తివారీ గతేడాది తొలిసారి బయటపెట్టాడు. కాగా, ఆరేళ్ళ కిందట ఓ స్నేహితుడి ద్వారా న్యూ ఇయర్ పార్టీలో తివారీ, సుష్మిత ఒకరికొకరు పరిచయమయ్యారు. తొలిచూపులోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కాగా, ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించే తివారీ మోకాలి గాయం కారణంగా నాలుగు నెలల నుంచి క్రికెట్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.