: భారత్ లో వెబ్ సర్ఫింగ్.. యమ డేంజర్!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర వెబ్ సర్ఫింగ్ కు నెలవుగా భారత్ నిలిచింది. రష్యాకు చెందిన సైబర్ సెక్యూరిటి లాబోరేటరీ 'కాస్పర్ స్కై' నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏప్రిల్-జూన్ నెలల్లో 35.6 శాతం మంది భారత్ నుంచే సైబర్ దాడులకు పాల్పడినట్టు సర్వే తెలిపింది. ఇదే సమయంలో 19,938,954 మాల్ వేర్ దాడులు కూడా ఇండియన్ సర్వర్లలో చోటు చేసుకున్నాయని వెల్లడైంది. ఈ కారణంగానే భారత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకర ఇంటర్నెట్ వినియోగ జాబితాలో 15వ స్థానంలో నిలిచిందని రష్యన్ సంస్థ తెలిపింది. స్థానికంగా ఉపయోగించే యూఎస్ బీ డ్రైవ్స్, సీడీలు, డీవీడీలు ఇంకా పలు ఇతర ఆఫ్ లైన్ పద్ధతుల ద్వారా మరింత ప్రమాదం ఏర్పడిందని చెప్పింది.