: ఆచూకీ లేని 400 మంది 'విమాన సేవికలు'
అవును... మీరు చదివింది నిజమే! 400 మంది ఎయిర్ హోస్టెస్ లు ఆచూకీ లేకుండా పోయారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒకప్పుడు ఎయిర్ ఇండియా అంటే ఎయిర్ హోస్టెస్ కు కలల సౌధం. ఇప్పుడు ప్చ్.. అంటూ నిట్టూరుస్తున్నారు. కంపెనీ నిర్వహణ తీరుతో వారికీ విసుగొచ్చింది. కష్టాల్లో ఉన్న సంస్థ టంచనుగా జీతాలు చెల్లించకపోవడంతో 400 మందికి పైగా 'ఫ్లయిట్ భామలు' రెండేళ్లపాటు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. సెలవు కాలం పూర్తయిపోయినా వారిప్పటికీ తిరిగి తమ విధుల్లోకి వచ్చి చేరలేదు. దీంతో వారిని తప్పిపోయారంటూ ఎయిర్ ఇండియా ప్రకటించేసింది. దీంతో వారి స్థానంలో వేరేవారికి ఎయిర్ హోస్టెస్ కొలువులకు లైన్ క్లియర్ అవుతుందన్నమాట. వీరి గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని, ఒకవేళ వేరే ఉద్యోగాలు చూసుకొని ఉంటే తక్షణమే ఎయిర్ హోస్టెస్ ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.