: సీఎం వరద సమీక్ష
రాష్ట్రంలో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాదులో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వరదల తీవ్రతపై అధికారులతో చర్చించారు. తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అప్రమత్తం చేశారు. అవసరమైతే రక్షణ బలగాల సాయం తీసుకోవాలని సూచించారు.