: 'మమ్మల్ని రక్షించండి బాబోయ్'... డ్రైవర్, కండక్టర్ ఆర్తనాదాలు


మమ్మల్ని రక్షించండంటూ డ్రైవర్, కండక్టర్ బస్సెక్కి ఆర్తనాదాలు చేస్తున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా తీగలవర్రె వాగు వద్ద చోటుచేసుకుంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర్లోని బెజ్జూరు, పెంచికలపేట ప్రధాన రహదారిలోని తీగలవర్రె వాగులో ఆర్టీసీ కి చెందిన ఏపీ 28-2827 బస్సు చిక్కుకుంది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సు పైకి ఎక్కి తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులు నడుం బిగించారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణీకులను తాళ్ల సాయంతో రక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News