: అమర్ నాథ్ యాత్రకు బ్రేక్


అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేశారు. కాశ్మీర్ లోయలోని ప్రముఖ పట్టణాలలో విధించిన కర్ఫ్యూ కారణంగా యాత్రకు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్న రామ్ బన్ లో ఆందోళనకారులపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా కాశ్మీర్ వేర్పాటు వాదులు నేటినుంచి మూడు రోజుల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రకు కొన్నిరోజులు విరామం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటికే వెయ్యి మంది యాత్రికులు జమ్మూ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News