: 'ఆంధ్రజ్యోతి' ఎండీపై కేటీఆర్ కేసు వాయిదా
'ఆంధ్రజ్యోతి' ఎండీ రాధాకృష్ణ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసు విచారణ వాయిదా పడింది. అనారోగ్యం కారణంగా ఆర్కే తాను వ్యక్తిగతంగా హాజరు కాలేనని, తన న్యాయవాదితో కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో, విచారణను ఈ నెల 23కు వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రైవేటు పంచాయతీల్లో పాల్గొని కేటీఆర్ అక్రమార్జనకు పాల్పడ్డారంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ చానల్లో పలు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. ఆధారాలు లేకుండా ఎలా కథనాలు రూపొందిస్తారని ప్రశ్నించారు. అంతేగాకుండా, తన పరువుకు భంగం కలిగిందంటూ హైదరాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు.