: అక్కడ చదరపు అడుగు రూ.1.23లక్షలే..
ముంబై రియల్టీ మార్కెట్లో ధరలు భగభగా మండుతున్నాయి. సాగరతీరంలో ఉన్న ఒక ఫ్లాట్ ఖరీదు 21 కోట్ల రూపాయలు పలికిందంటే అక్కడి మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్లి ప్రాంతంలోని 'సముద్ర మహల్' టవర్స్ లో 10వ అంతస్తులో ఉన్న మూడు పడకగదుల ఫ్లాట్ లో చదరపు అడుగు విలువ 1.23లక్షల రూపాయలు పలికింది. 1,706 చదరపు అడుగుల సదరు ఫ్లాట్ ను గ్లాస్ తయారీ కంపెనీ బోరోసిల్ మరొకరి నుంచి కొనుగోలు చేసింది. ముంబై మార్కెట్లో ఇదే అత్యధిక ధర. నెపియన్ సీ రోడ్డులోని తాహీ హైట్స్ లో గతంలో చదరపు అడుగు 1.20లక్షల రూపాయలు పలుకగా.. ఆ విక్రయ ధరే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది.