: సినిమా పేర్లు తెలుగులో ఉండాలంటే ప్రోత్సాహకాలు ప్రకటించాలి: సుద్దాల అశోక్ తేజ


తెలుగు భాష పునర్వికాసంలో భాగంగా సినిమాల పేర్లు సైతం అచ్చ తెలుగులో ఉండాలంటే తగిన ప్రోత్సహకాలు ప్రకటించినప్పుడే అది సాధ్యమవుతుందని ప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మాతృ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అశోక్ తేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కాగా, ఇంటర్ విద్యలో తెలుగు భాషను ఆప్షనల్ గా తీసుకున్న విద్యార్థుల పట్ల మూల్యాంకనం చేసే అధ్యాపకుల వైఖరిలో మార్పు రావాలని శాసనమండలి ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఇక తెలుగులో చదివిన వారికి ఉద్యోగాల్లో పెద్దపీట వేయాలని తెలుగు పరిరక్షణ సమితి సూచించింది.

  • Loading...

More Telugu News