: కోనసీమలో పట్టుబడ్డ రూ.2.5కోట్ల విలువైన నగలు
ఓ కారు రయ్ మంటూ 100 కి.మీ. స్పీడులో వెళుతోంది. పోలీసులకు అనుమానమొచ్చి ఆపి చూశారు. వారి కళ్లు జిగేల్మన్నాయి. అన్నీ నగలే! వాటి విలువ రెండున్నర కోట్ల రూపాయలకు పై మాటే. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు వద్ద పోలీసుల తనిఖీ సందర్భంగా ఇది చోటుచేసుకుంది. నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్ నుంచి వివరాలు రాబడుతున్నారు.